గత మూడు నెలలలుగా మనందరం వినపకూడదు అని కోరుకునే, కాని వినవలసి వస్తున్న ఏకయిక పదం కరోన.

ఈ ఆర్టికల్ లో కరోనా లో handwash ఎలా చేసుకోవాలి? మాస్క్ లు ఎలా ధరించాలి? ఏ మాస్క్ మంచిది? Sanitizer లో ఆల్క్హాహాల్ శాతం ఎంత ఉండాలి? ఎంతమంది రోజు చనిపోతున్నారు? ఇలాంటి వివరాలు చెప్పడానికి కాదు. కొన్ని interesting విషయాలు మాట్లాడుకుందాం.

ఒక disaster మనకి ఎదురయినపుడు భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే బెంగ అందరికి ఉంటుంది. పరీక్షలు రాయాల్సిన వాళ్ళు, ఉద్యోగం వచ్చి results కోసం ఎదురుచూస్తున్న వాళ్ళు, ఇపుడే కోర్సు పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్నవాళ్లు, ఇపుడిపుడే లైఫ్ లో సెటిల్ అవుతున్నవాళ్ళు, కుటుంబాన్ని ఒక్క చేత్తో లాగుతున్న ఎంత మంది? వీరందికి ఉన్న ఒకే ఒక ప్రశ్న. నెక్స్ట్ ఎలాగా? Future ఏంటి?

Next Enti Priyadarshi Pelli Choopulu Meme

ఇపుడు మనం గాబరా పడటం కన్నా కూడా స్వీయ అవగాహనతో ఉండటం అవసరం. ఎలాంటి పరిస్థితి వచ్చిన నాకున్న బలాలతో, దైర్యంతో వాటికి తగ్గట్టుగా నన్ను నేను మలచుకోగలను అనే నమ్మకం మన మీద మనకి ఉండటం చాలా అవసరం. దేశ ఆర్ధిక పరిస్థితుల పై నా ఎదుగుదల ఆధారపడకూడదు. నా ఎదుగుదల తో, ఆలోచనలతో నా సహయం నేను సమాజానికి/ దేశానికి అందించాలి అనే ధైర్యం కలిగి ఉండాలి.

రండి, ఆనందాన్ని కొలుద్దాం!

ఆనందానికి సూచిక ఏంటి!? అలా ఎలా కొలుస్తాము చెప్మా?

కొలుస్తారండీ! దీనికి ర్యాంకులు కూడా ఇస్తారు, తెలుసా? ప్రపంచ దేశాలు అన్నిటిలోకి ఆనందంగా (Happiness Index)  ఉన్న జనాభా ఉన్న దేశాలుపై సర్వే చేస్తే మన దేశం 144 వ స్థానం సంపాదించింది. మొత్తం ఉన్నది 195 దేశాలు.

You can read about Human Development Index: Here.

Gross National Happiness Factors

Happiness Index Factors

ఇపుడు మనం ఆలోచించాల్సింది, మన దేశానికి  1st rank రావాలంటే  ఎలా పక్క దేశాల నుండి చూసి కాపీ కొట్టాలా? లేక, malpractice చేసి 1st rank ఎలా సంపాదించాలా అనే కాదు. ప్రతీ ఒక్కరూ వారి వారి జీవితాల్లో ఆనందంగా ఉండాలంటే ఏమి చెయ్యాలో తెల్సుకొవాలి. 

Lifeskills in Corona Times:

మనం ఎక్కువ కష్టపడకుండానే  ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్యమైన జీవన నైపుణ్యాలను ప్రతిపాదించింది. ఈ నైపుణ్యాలు చిన్న-పెద్ద, ధనిక- పేద, లింగ, మత, ప్రాంత బేధం లేకుండా అందరికి నిర్దేశించబడినవి.

జీవన నైపుణ్యాలు

జీవన నైపుణ్యాలు అంటే మార్కెట్లోకి వచ్చిన కొత్త ప్రోడక్ట్ ఏమి కాదండోయ్. ఇవన్ని మనకి తెలిసినవే. కాకపోతే కుంచెం వివరంగా తెలిసి ఉండకపోవచ్చు అంతే.

కరోనా కాలంలో మనకి తెలియకుండానే మనం కొన్ని జీవన నైపుణ్యాలను పెంపొందించుకుంటున్నాం. 

జీవన నైపుణ్యాలు 1: Coping with Stress and Emotions

ఉద్యోగాలు లేవు, షాపింగ్ లేదు, స్కూల్స్ / కాలేజీలు లేవు, సినిమాలు లేవు, పార్టీలు, సరదాగా బయటకి వెళ్లి నోట్లో ఏదోకటి వేసుకోడానికి లేదు, అన్నిటికంటే ముఖ్యంగా సీరియల్స్ ఆపేశారు, స్కూల్ లేకపోవడం ఇంట్లో పిల్లలని సముదాయించుకోవడం, బ్యాంకు లో ఉన్నదంతా నెమ్మదిగా బయటకి రావడం, ఈ పరిస్థితులలో భవిష్యత్తులో కుటుంబంలో అందరి పొట్టలు నింపగలమా? అద్దె, కరెంట్ బిల్ల్స్ కట్టగలమా అనే భయం..

Life skills: Stress Management

మనకి మనమే మన ఒత్తిడిని ఎలా manage చెయ్యాలో తెల్సుకోవాలి.

ఇవన్ని ప్రతీ కుటుంబానికి ఉండేవే అయినా సరే ఇవన్ని తట్టుకుని, కరోన తో యుద్ధం చేస్తూ, మన ప్రాణాలని కాపాడుకుంటున్నాము. అంతే కాని కరోనాకి తల వంచి, బ్రతికితే బ్రతుకుతాము, లేదంటే లేదు అని అనుకోవడం లేదు. Coping with Stress and Emotions అంటే, ఒత్తిడిని తట్టుకుని, మన మనోభావాలను మనం నిగ్రహించే శక్తి కలిగి ఉండటం.

సమస్య ఎదురయినపుడు మన భావోద్వేగాలని తట్టుకుని నిలబడగలిగితే మన జీవితంలో ఎదైనా ఎదుర్కోవచ్చు

జీవన నైపుణ్యాలు 2: Interpersonal Skills

రోజూ చాలా వేగంగా పరుగులు పెట్టే మన జీవితంలో ఈ కరోన వలన sudden బ్రేక్ పడింది. దాదాపుగా అందరికి వారి వారి దైనందిన జీవితాల నుండి, ఏమి చెయ్యాలో అర్ధం కానంత కాళీ దొరికింది. ఒక్కసారిగా అందరికి బంధువులు, చిన్ననాటి స్నేహితులతో కాలక్షాపం చెసే అవకాశం దొరికింది.

మనకి గుర్తుకు వచ్చే సమయానికి వారి జీవితాలలో ఎన్నో మార్పులు జరిగిపోయాయి. ఇన్ని రోజులు ఏమేమి మిస్ అయ్యమో అనే విషయాన్ని మనం తిరిగి తెలుసుకుంటున్నాము. సరదాగా కాసేపు వారితో మన సంతోషాలని, బాధలని పంచుకుంటే ఎంత బాగుంటుందో చూడగలుగుతున్నాము. మనకి సంతోషం వచ్చినా, అనందం వచ్చినా నలుగురు ఉంటే ఎంత బాగుంటుందో అర్ధం అవుతోంది.

ఇంటర్పెర్సొనల్ స్కిల్ల్స్: Life skills in Corona Times

చెందమామ రోజూ ఒకేలా ఉంటుంది పర్ధూ. కానీ ఒక్కొక్కసారే మనసుకి నచ్చుతుంది. తేడా అక్కడ ఉండదు. మన Interpersonal Skillsలో ఉంటుంది.

Interpersonal Skills: నలుగురితో నవ్వుతు, వారి బాధలో పాలు పంచుకుంటూ, unconditional గా ఉండటమే ఈ నైపుణ్యం. నాకు కష్టం వస్తే నలుగురు నాకోసం నిలబడతారు అనే భావన మనకి ఎంతో ప్రశాంతతని ఇస్తుంది.

కరోనా సమయంలో సాధారణ మరణాలు (non corona deaths) కూడా జరుగుతున్నాయి. Lockdown వలన ఇంట్లో వారు రాలెని కొన్ని పరిస్థితుల్లో ఊరు వాళ్ళే జరగాల్సిన కార్యక్రమాలను దగ్గరుండి చేస్తున్నారు. అందరితో సంబంధ బాంధవ్యాలు ఎంత ముఖ్యమో ఒక కష్టమో, ఉపద్రవామో వస్తే కాని మనకి పూర్తిగా తెలియ లేదు.

జీవన నైపుణ్యాలు 3: సహానుభూతి or Empathy

  • మనం ఎవరికీ ఫోన్ చేసినా అతి చక్కటి స్వరంతో వినే మాట “ మనం పోరాడాల్సింది వ్యాధితో, రోగితో కాదు, వారిని వివక్షతో చూడద్దు… వారికి సహకరిద్దాం “.
  • అలాగే, ఎపుడూ కని, విని ఎరుగానట్టుగా ఎటువంటి బేధం లేకుండా , అందరు ఏకపక్షంగా ఉంటూ, తమకు తోచిన సహాయాన్ని అందించడం చూస్తూ ఉన్నాము. ఆర్ధిక ఇబ్బందుల వలన మరణాలను దాదాపుగా తగ్గించడానికి కారణం, అందరు కలిసి మెలసి సహాయ సహకారాలు చేసుకోవడమే.

Empathy Quotes: Telugu Memes: Life skills in Corona Times:

మీకు అర్ధమవుతోన్దా?

ఇదే సహానుభూతి అంటే. ఎదుటి వారి పరిస్థితిని అర్ధం చేసుకుని, వారి స్థానంలో , ఇబ్బందులలో మనం ఉంటే ఎలా ఉంటుందో ఉహించుకుని, వారికి సహకారం అందించడమే సహనుభూతి.

జీవన నైపుణ్యాలు 4: విశ్లేషణా ప్రతిభ

ఇంట్లో పెళ్లి ముహూర్తం పెట్టుకున్నాం, పెళ్లి ఆగకుండా ఎలా చేసుకోవాలి? Redzone లో ఉన్నాము, ఇంట్లో సరుకులు లేవు, ఎలా ఇల్లు గడపాలి? కరోన ఎక్కడ పెడితే అక్కడ ప్రభలుతోంది ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి? అసలు ఈ పరిస్థితులలో పెళ్ళి పెట్టుకొవడం ఎంత వరకూ అవసరం?

Lifeskills in Corona Times: Decision Making Skills Telugu Memes

అందుకే విశ్లేషణా ప్రతిభ జీవన నైపుణ్యం అనేది.

మన పనులు ఆగకుండా, జాగ్రత్తలు తీసుకుని ఎలా ఉండాలి? సమావేశాలని, ఆఫీస్ పనులని ఆన్లైన్ ద్వారా ఎలా అందించాలి? వీటన్నిటిని మనం చాలా ప్రతిభతో ఎదుర్కొంటున్నాము.

వీటిలో మూడు నైపుణ్యాలు దాగి ఉన్నాయి: Problem Solving, Decision Making, and Critical Thinking.

ఇవి కావటానికి మూడు నైపుణ్యాలు. కానీ మూడు వేరు- వేరు కాదు. సమస్యని పరిష్కరించుకోగలగడం (Problem Solving), మనం తీసుకునే నిర్ణయాల ద్వారానే సాధ్యం (Decision Making), నిర్ణయాలు తీసుకోవడానికి విశ్లేషణాత్మక ఆలోచన (Critical Thinking) అవసరం.

జీవన నైపుణ్యాలు 5: కమ్యూనికేషన్

కరోనా మొదలయినప్పటి నుండి మనలో చాలా మంది వర్క్ ఫ్రొం హోమ్ చేస్తున్నాం, అందరితోనూ మాట్లాడి సమాచారాన్ని సేకరిస్తున్నాం. ఈ లొక్డౌన్ వల్ల వచ్చ్చిన దూరాల వలన అందరం ఎంతో కొంత కమ్యూనికేషన్ ని మిస్ అవుతున్నాం, దాని అవసరాన్ని గ్రహించాము.

సాధారణంగా కమ్యూనికేషన్ అంటే అందరికి గుర్తెచ్చేది “గుక్క తిప్పకుండా అనర్గళంగా మాట్లాడటం” అనే కదా? పిల్లల దగ్గర మనకంటే చిన్న వాళ్ళ దగర వారు చెప్పేది వినకుండా పెద్ద పేద్ద భాషణలు ఇస్తుంటాం కదా, అదే మీ బాస్ దగ్గరో, స్కూల్ ప్రిన్సిపాల్ దగ్గరో ఇవ్వండి- ఎలా వర్క్ అవుతుందో చూద్దాం.

కాని కమ్యూనికేషన్ అంటే one way traffic లాగా స్పీచ్లు ఇవ్వడం కాదు.

సినిమాల్లో చూడటానికి, సీరియల్స్ లో, యూట్యూబ్ వీడియోస్ లో వినటానికి పెద్ద పెద్ద లెక్చర్స్ బానే ఉంటాయి. వాళ్ళు వినటానికి ఆగితే మనకి బోర్ కొడుతుంది గనుక. వినటం, విన్న దానిని అర్ధం చేసుకోవడం, దాని బట్టి మనం స్పందన తెలియ చేయడం. ఇవన్ని మంచి కమ్యూనికేషన్ లో భాగాలే. కమ్యూనికేషన్ ఒక జీవన నైపుణ్యం.

మూడు నెలల నుండి మనం ఈ నైపుణ్యాన్ని కూడా చాలా బాగా ఫాలో అవుతున్నాము. అన్నిటిలోను దీనిని అవలంబించడమే తరువాయి.

bommarillu meme: Jeevana Naipunyaalu: Communication Skills: Life skills in Corona Times:

The Corona Talk…

ఈ lockdown సమయంలో ప్రభుత్వం తీసుకునే చర్యల గురించి, మనకి సూచించే జాగ్రత్తల గురించి మనం మీడియా, న్యూస్ పేపర్ మొదలగు వాటి నుండి ఏ విధంగా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలని జాగ్రత్తగా ఫాలో అవుతున్నాము కదా?

అలా విని, అర్ధం చేసుకోవడం వల్లే కదా మనమంతా సాఫీ గా సాగిపోతున్నాం? మరి అలా మన దైనందిన జీవితంలో ఉన్నావారు చెప్పింది కూడా విని, అర్ధం చేసుకుని స్పందించడం వలన ఎన్ని ఉపద్రవాలు తప్పుతాయో, ఎన్ని అపోహలు తీరతాయో! ఇప్పుడైనా ఇది అలవర్చుకుందాం.

జీవన నైపుణ్యాలు 6: స్వీయ అవగాహన

మనలో నిజంగా ఎంత మంది ఆనందంగా ఉంటున్నాము?  ఆనందంగా ఉన్నామా, కోపంగా ఉన్నామా లేక బాధని ఇంకొక రకంగా బయటకి తెస్తున్నామా? ఇలాంటి బేసిక్ విషయాలు, మన భావాల పట్ల మనకు కనీస అవగాహన ఉండాలి.

ఈ నైపుణ్యాన్నే మనం స్వీయ అవగాహన అని పిలుస్తాము. 

Life skills in Corona Times:: Self Awareness Telugu జీవన నైపుణ్యాలు

స్వీయ అవగాహనకు ఉదాహరణ: మనకి ఎవరో అంటే కోపం వస్తోందా, లేదా ఈర్ష్య లోపల ఉండడం వల్ల వాళ్ళు చేసేది ప్రతీదీ చిరాగ్గా అనిపిస్తోందా? అసలు వేరే వాళ్ళతో మనని మనం పోల్చుకుని అస్థిమితం కలుగుతోందంటే, అది పక్క వాళ్ళ గురించి కూడా కాదేమో? మనలో మనకున్న తీరని, చేరుకోలేని విషయాల గురించి ఉన్న ఘర్షణా?

Samantha Memes Son of Sathyamurthy Allu Arjun on Self Awareness: Jeevana Naipunyaalu

Unprofessional Emoter.

చూసారా మనం కరోన కారణంగా ఎన్ని జీవన నైపుణ్యాలు నేర్చుకున్తున్నమో, ఈ జీవన నైపుణ్యాల ప్రాముక్యతను చెప్పడానికి కరోన అనే సందర్భం ఇక్కడ వాడటం అనేది ఇబ్బందికరమయినా సరే, ఇది రాయడానికి కారణం మన నిత్య జీవితంలో జీవన నైపుణ్యాల అవసరం చాలా ఉంది అని వివరించడానికి. ఎలాంటి pandemic వచ్చినా సరే మనం మన స్వంత వ్యక్తిత్వాన్ని, ఆనందాలని వదులుకోవలసిన పని లేదు. అదే జీవితం. అలా ఉండాలంటే జీవన నైపుణ్యాల పై అవగాహన పెంపొందిచుకోవాలి. 

మేము కరోన ని ఎలా అయితే ఉదాహరణగా తీసుకుని జీవన నైపుణ్యాల ను వివరించానో మీరు కూడా ఏదోక సందర్భాన్ని తీసుకుని మాకు మీ ఆలోచనలు రాసి పంపండి.

———————————————————————————————————————-

Concept Writing: Deepthi

Developmental Editing: Pavani Sairam.

0