COVID19 Relief Efforts by PCT:

  • Aiding the most affected families of the semi- orphan children selected into Project Vaaradhi, Free Distribution of Masks.
  • Creating awareness on ways to protect from Corona Virus
  • Encouraging Women Entrepreneurship and Women Self Help Groups by ordering masks from them against a payment of Rs. 10 per mask.

కోవిడ్- 19 వలన ఉపాధి లేని పేద, నిరుపేద కుటుంబాలకు పడాల చారిటబుల్ ట్రస్ట్ – రూ.1,83,000/- పంపిణి.

PCT- Project Vaaradhi:

పడాల చారిటబుల్ ట్రస్ట్ 2002 నుండి విద్యారంగం మరియు గ్రామీణ అభివృద్దికి కృషి చేస్తోంది. గత ఏడు సంవత్సరాలుగా “ప్రాజెక్ట్ వారధి” ద్వారా తల్లి కాని, తండ్రి కాని, లేదా ఇద్దరు లేని నిరుపేద కుటుంబాలలోని పిల్లలలను దత్తత తీసుకుని వారి చదువుకు కావలసిన అన్ని సదుపాయాలూ కలిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో 70 ప్రభుత్వ హైస్కూల్స్ లో అమలు అవుతోంది.

Vaaradhi Children

The needs of Semi orphans are usually not noticed. Through Project Vaaradhi, we support them.

COVID19 Relief to families of Project Vaaradhi Kids:

గత రెండు నెలలుగా COVID19 కలిగిస్తున్న భీభత్సం అందరికీ తెలిసినదే. ఈ ప్రాజెక్ట్ వారధి లోకి ఎంపిక చేసుకున్న పిల్లల కుటుంబాలలో మామూలుగానే సరైన ఉపాధి లేక ఆరోజు వచ్చిన కూలి పై ఆధారపడి కడుపు నింపుకునే వారు లేదా కేవలం పెన్షన్ మీద ఆధారపడే వారే  దాదాపుగా  ఉన్నారు. అందునుండి, ఆర్ధికంగా అత్యంత ఇబ్బంది ఎదుర్కొంటున్న కొన్ని కుటుంబాలను ఎంపిక చేసి వారికి Rs.1000/- ను వారి బ్యాంకు ఖాతాలలోకి PCT సంస్థ జమ చేయడం జరిగింది.

COVID- 19 Relief for Vaaradhi Students

COVID19 Relief for Students of project Vaaradhi.

ఇప్పటి వరకు మొదటి దశగా 183 కుటుంబాలకు Rs. 1,83,000/- ను పంపిణీ చేయడం జరిగింది.

COVID19 Relief – Distribution of Masks

కరోనా నివారణలో వ్యక్తిగత శుభ్రత మరియు సామాజిక దూరం చాలా కీలకం. ఈ క్రమంలో ఉపయోగపడే మాస్క్ లను కాకినాడ రూరల్, అవంతి నగర్, పడాల చారిటబుల్ ట్రస్ట్ ఆఫీస్ పరిసర ప్రాంతాలలో ఉన్న కుటుంబాలకు మాస్కులను పంచిపెట్టడం జరిగింది.

COVID- 19 Relief Efforts by PCT

COVID 19 Relief Efforts by PCT

COVID19 Relief while supporting Women Enterpreneurship:

AK.మల్లవరం గ్రామంలో, కమ్యూనిటీ డెవలప్మెంట్ మరియు మహిళా సాధికారత కొరకు పడాల చారిటబుల్ ట్రస్ట్ చేపట్టిన MVM ప్రాజెక్ట్ లో భాగంగా కుట్టు మెషీన్ మీద శిక్షణను అందుకున్న మహిళల చేత ఈ మాస్కులను తయారు చేయించడం జరిగింది. ఒక్కో మాస్క్ 10 రూపాయలు చప్పున ఒక వెయ్యి మాస్కులను వారి వద్ద నుండి తీసుకోవడం జరిగింది.

To know more about the success story of these Women of a tailoring group who stay amongst the lush green fields of Mallavaram, read this: Success of a rural tailoring group.

Women Group who prepared Masks

COVID19 Relief : Women Group of Mallavaram Village who made masks.

కరోనా సమయంలో మల్లవరం గ్రామ మహిళల నుండి మాస్క్ లు కొనుగోలు చేయడం ద్వారా వారికి ఉపాధి కల్పించడం మరియు అవే మాస్కులను ప్రజల్లో అవగాహన పెంచే క్రమంలో పంచిపెట్టడం జరిగింది.

Thank you all.

0